నేనున్నాను అని చూపుతోనే ధైర్యం చెప్పే ప్రేమ
మౌనాన్ని మాటలకంటే ఎక్కువగా అర్ధం చేసుకొనే ప్రేమ
కష్టాన్ని కనీసం దరిచేరనియ్యని ప్రేమ
తప్పు అని 1౦౦ మంది చెప్పినా ..ఎం జరిగింది అని నీ నోటినుండి తెలుసుకోవాలని నిన్ను నమ్మే ప్రేమ
నొప్పి లో నీ చెయ్యి పట్టి ఓదార్చే ప్రేమ
సంతోషం లో నీ చిరునవ్వుని చూసి మరింత ఆనంద పడే ప్రేమ
ఆపద లో నీ ముందు నిలబడి నిన్ను కాచే ప్రేమ
విజయం లో నీ వెన్ను తట్టి ప్రోత్సహించే ప్రేమ
నీ గౌరవాన్ని తన చేతులతో కాపాడే ప్రేమ
నీకు అర్ధం కాని పరిస్థితుల్లో నీ తోడై నిలిచే ప్రేమ
నీ ఇష్టాన్ని గౌరవించే ప్రేమ …నీ అయిష్టాన్ని నీపై రుద్దని ప్రేమ
నిన్ను నిన్నుగా ప్రేమించ గలిగిన ప్రేమ ..ఎప్పటికీ నీదై నిలిచే ప్రేమ