1. కలలాంటి
నా జీవితంలో
అలవై వచ్చావా ….
సముద్రమంత
కన్నీటిని
మిగిల్చి వెళ్ళావు ….
2. ప్రపంచమంతా నా చుట్టూ వున్నా ….
నువ్వు లేక నేను ఒంటరిని ….
ప్రాణాలతో నిండు నూరేళ్లు వున్నా ….
నీ తోడు లేక నేను శవం
3. ప్రియా ……
గుచ్చుకునే ముల్లును చూడకు
విచ్చుకుని గులాబీని చూడు
నాపై నీకున్న ద్వేషాన్ని చూడకు
నీపై నాకున్న ప్రేమను చూడు
4. కళ్ళకు నచ్చిన వారిని
కన్నుమూసి తెరిచేలోగా …
మరిచిపోవచ్చు కానీ …
మనసుకు నచ్చిన వారిని
మరణం వరకూ మరువలేము
5. నీ చిరు కోపం తో
పగిలిన నా హృదయాన్ని నీ
చుంబనాలతో మళ్ళి అతికించా
6. నా హృదయాన్ని కోవెల చేసి …
నీ రూపాన్నే దైవంగా తలచి …..
నా ప్రేమ సుగంధ పుష్పాలను ….
కవితాక్షరాలుగా మార్చి ….
ప్రతీ దినం నిన్ను అర్చిస్తున్నా ….
ఏదో ఒక రోజు ప్రసన్నం అవుతానని ……
7. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆఖరి
క్షణంలా తలచాలి ఎవరికీ తెలుసు
ఇదే ఆఖరి క్షణమేమో
8. ప్రేమంటే అవతలివారిని
అర్ధం చేఉకోవటం కాదు,
అవతలివారిచే
అర్ధం చేసుకోబడటం కూడా ……
9. మనసులో ప్రతి మలుపులో
నిన్ను మలచుకున్నాలే ….
కలలో మధువనులతో
నీ పిలుపు విన్నానులే
ఓ నేస్తమా …..
నన్నే చేరుకున్నావా ….
ఇది కలా …….!
నిజమా ……. !
10. తారలు లేని ఆకాశం … చిక్కని చీకటిని
ఒలకబోస్తుంటే రాలిన మల్లెలు రాత్రంతా నాకై
విషాదాలును ఆలపిస్తున్నాయి నువ్వు రావంటూ ……