ఇంగలంబు తోడ నిల సల్పుతోడను
ఇంగలంబు తోడ నిల సల్పుతోడను
పరుని యాలితోడ పతితుతోడ
సరసమాడుటెల్ల చావుకు మూలము
విశ్వదాభిరామ వినురవేమ!
ఇంచుకంత యోని కెగసెడు జనములు
ఇంచుకంత యోని కెగసెడు జనములు
కంచముకడ పిల్లి గాచినట్లు
పంచబాణునింటి బానిసె కొడుకులు
విశ్వదాభిరామ వినర వేమ!
ఇంచుకంతబోన మీశ్వరార్పణ మన్న
ఇంచుకంతబోన మీశ్వరార్పణ మన్న
పుణ్యలోకమునకుఁ బోవు నతఁడు
అన్నదానమునకు నధికదానము లేదు
విశ్వదాభిరామ వినర వేమ!
ఇంటియాలు విడిచి యిల జారకాంతల
ఇంటియాలు విడిచి యిల జారకాంతల
వెంటఁ దిరుగువాఁడు వెఱ్ఱివాఁడు
పంటచేను విడిచి పరిగ యేరినయట్లు
విశ్వదాభిరామ వినర వేమ!
ఇంటిలోనిధనము నిదినాది యనుచును
ఇంటిలోనిధనము నిదినాది యనుచును
మంటిలోనఁదాచు మంకుజీవి
కొంచఁబోడు వెంట గుల్లకాసును రాదు
విశ్వదాభిరామ వినర వేమ!
ఇంతి గన్న జన్ను లింతింతలని చూచి
ఇంతి గన్న జన్ను లింతింతలని చూచి
మోహమంది బుద్ధి మోసపోవు
గరిత విడని నివాగానరాదా యెరా!
విశ్వదాభిరామ వినురవేమ!
ఇంతి తనదుపేరు నెల్లకాలంబును
ఇంతి తనదుపేరు నెల్లకాలంబును
ప్రజలు దలఁచునట్టి ప్రతిభఁ గాంచె
నింతికి పతిభక్తి యెంతనవచ్చును
విశ్వదాభిరామ వినర వేమ!
ఇంత వగవ వెలసె నేకాంత బుద్ధితా
ఇంత వగవ వెలసె నేకాంత బుద్ధితా
హరిహరాదులందు నాశ లుడిగి
శాంతబుద్ధి నుండ సమకూరును సుఖంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ఇంతిఁ జూచెనేని యింతంత యనరాదు
ఇంతిఁ జూచెనేని యింతంత యనరాదు
కానవహ్నిలక్క కరఁగినట్లు
వట్టిమోహ మిట్లు రట్టులఁ జేసెరా
విశ్వదాభిరామ వినర వేమ!
ఇంతికనులు చనులు నెంత లెస్సనిచూచి
ఇంతికనులు చనులు నెంత లెస్సనిచూచి
మోహపడును బుద్ధి మోసపోయి
గరిసెలోనివానిఁ గానలే దాయెరా
విశ్వదాభిరామ వినర వేమ!
ఇంతకాలముండి యెఱుకమాలినజీవి
ఇంతకాలముండి యెఱుకమాలినజీవి
చచ్చిపుట్టుచుండు సహజమనుచు
నెఱుక మఱచుచోట నెఱుఁగునా బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ఇంద్రియ పరవశుఁ డధముం
ఇంద్రియ పరవశుఁ డధముం
డింద్రియ పరవశుఁడు భక్తియెడ మధ్యముండౌ
నింద్రియజయుఁ డుత్తముఁ జి
తేంద్రియసుతుఁడు విన మహేశుఁడు వేమా!
ఇంద్రియములచేత నెగ్గొందుచుండెడు
ఇంద్రియములచేత నెగ్గొందుచుండెడు
వెఱ్ఱిమనుజుఁ డేల వెదకు శివుని?
ఇంద్రియముల రోసి యీశునిఁ జూడరా
విశ్వదాభిరామ వినర వేమ!
ఇచ్చకము భువిని వశ్యము
ఇచ్చకము భువిని వశ్యము
కుచ్చిత మీలోకనింద కోవిదునకు నీ
తుచ్చమున హాని వచ్చును
మచ్చరమే తన్నుఁ జెఱచు మహిలో వేమా!
ఇచ్చెడి వారలసంపద
హెచ్చునదేకాని లేమి యేలా కలుగున్
అచ్చెలమ నీళ్లుచల్లిన
విచ్చలవిడి నూరుచుండు వినరా వేమా !
ఇచ్చిపుచ్చుకొన్న హితమయిన మనువులు
ఇచ్చిపుచ్చుకొన్న హితమయిన మనువులు
తగ్గులేక యల్లు తామరవలె
కాచిపూచి పండి కడురమ్యమై యుండు
విశ్వదాభిరామ వినర వేమ!
ఇచ్చువానియొద్ద నీయనివాడుండఁ
ఇచ్చువానియొద్ద నీయనివాడుండఁ
జచ్చుగాని యీవి సాగనీఁడు
కల్పతరువుక్రింద గ్రచ్చ చెట్టునట్లు
విశ్వదాభిరామ వినర వేమ!
ఇట్టి సాధువిద్య యెందులేదని చూచి
ఇట్టి సాధువిద్య యెందులేదని చూచి
గాఢవిద్య నేర్చి కానలేక
సాధుసజ్జనముల సాంగత్యమెఱుఁగక
బాధపడుదురు తుది పరులు వేమ!
ఇట్టికనుల బ్రహ్మ మెట్లు చూడఁగవచ్చుఁ
ఇట్టికనుల బ్రహ్మ మెట్లు చూడఁగవచ్చుఁ
జూచుకనులువేఱు చూపువేఱు
చూపులోనమరిచి చూడంగవలవదా
విశ్వదాభిరామ వినర వేమ!
ఇట్టిజాడఁగాన నెందఱయిన నేమి
తమ తలంపులలోనఁ దత్వ శిఖామణిఁ, దలఁచిన వారెల్లఁ దత్వ విదులు
ఘనమైన నిబిఢాంధ కారంబునను జ్యోతి ననువునఁ జూచిన యతఁడె యోగి
శివునిలో జీవుని జీవునిలో శివు నొనరఁ దెలిసినవాఁడు యోగదృక్కు
సాంఖ్య యోగంబున సర్వంబు శివుఁడని నిశ్చయించినవాఁడు నిర్మలుండు
ఇట్టిజాడఁగాన నెందఱయిన నేమి
పుట్టఁ గాలశివుని పట్టఁగలరె
పొట్టనీవు పాసిపోగఁ దా నుబ్బురా
విశ్వదాభిరామ వినర వేమ!
ఇట్టిపంచజనుని యేష్యము దెలిసిన
ఇట్టిపంచజనుని యేష్యము దెలిసిన
పెట్టి పుట్టి కట్టి పృథివి బ్రతికి
చచ్చి సిద్ధుఁడగుచు సర్వజ్ఞుఁడయినిల్చు
నెల్లమహిమ నీకు చెల్లు వేమ!
ఇదినాకుఁ జాలఁదనుచును
ఇదినాకుఁ జాలఁదనుచును
వదలక మదిలోననైన వస్తువు భ్రమతల్
కదిసి విడనాడ కుండిన
నదియే సంసారబీజ మందుర వేమా!
ఇదియ పరమటంచు నితరచింతలు వీడి
ఇదియ పరమటంచు నితరచింతలు వీడి
మనసుఁ జెదరనీక మట్టుపఱచి
కొదువలేక నిలువ కోర్కెలు ఫలియించు
మనసులోన నుండు మహిమ వేమ!
ఇనుము విఱిగె నేని యినుమాఱు ముమ్మాఱు
ఇనుము విఱిగె నేని యినుమాఱు ముమ్మాఱు
కాచియతుక నేర్చు కమ్మరీడు
మనసు విఱిగెనేని మఱియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినర వేమ!
ఇమ్ముదప్పువేళ నెమ్మెలన్నియు దప్పి
ఇమ్ముదప్పువేళ నెమ్మెలన్నియు దప్పి
కాలమొక్కరీతి గడపవలయు
విజయు డనువుదప్పి విరటుని గొల్వడా?
విశ్వదాభిరామ వినురవేమ!poem>
=== ఇరుకువచ్చువేళ నీశ్వరు తలతురు ===
<poem>ఇరుకువచ్చువేళ నీశ్వరు తలతురు
కరుణ గనునె వట్టి గాసిగాక
సుఖము వచ్చువేళ చూడంగ నొల్లరు
విశ్వదాభిరామ వినురవేమ!
ఇరుగుపొరుగువారి కెనయుసంపదఁ జూచి
ఇరుగుపొరుగువారి కెనయుసంపదఁ జూచి
తనకులే దటన్న ధర్మమేమి
ధర్మమన్నఁ దొల్లి తన్నుక చచ్చిరి
విశ్వదాభిరామ వినర వేమ!
ఇల్లునాలివిడిచి యినుపకచ్చలఁ గట్టి
ఇల్లునాలివిడిచి యినుపకచ్చలఁ గట్టి
వంటకంబు నీరువాంఛ లుడిగి
యొంటినున్న యంత నొదవునా తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!
ఇసుక బొగ్గు రాయి యినుమును చర్మంబు
ఇసుక బొగ్గు రాయి యినుమును చర్మంబు
కసపుపొల్లుకట్టి కట్టబెట్టి
పల్లుదోమినంత పరిశుద్ధులగుదురా
విశ్వదాభిరామ వినురవేమ!
ఇహపరాదులకును నిది సాధనం బని
ఇహపరాదులకును నిది సాధనం బని
వ్రాసి చదివి విన్నవారికైన
మధ్యమకర్మములు మహిమతో నడచును
బడుగుకైన ముక్తిపదము వేమ!
ఇహమందు గురుని కీదేహ మిచ్చిన
ఇహమందు గురుని కీదేహ మిచ్చిన
పరముజూచి గురుతు పట్టియిచ్చు
స్థిరముగాను బుద్ధిచెడనీక చూడరా
విశ్వదాభిరామ వినురవేమ!
ఇహము విడువ ఫలము లింపుగఁ గలవని
ఇహము విడువ ఫలము లింపుగఁ గలవని
మహిని బలుకువారి మాటకల్ల
యిహములోనఁ బరము నెరుఁగుట కానరో
విశ్వదాభిరామ వినర వేమ!
ఇహమునందు నేమి యిడుములఁ బడినను
ఇహమునందు నేమి యిడుములఁ బడినను
పరమ సాధన్హార పదవి గాదు
పరులుకారు నెట్టి వెరవునఁ జూచిన
విశ్వదాభిరామ వినర వేమ!
ఇహమునందు బాధలెన్నైనఁ బడవచ్చు
ఇహమునందు బాధలెన్నైనఁ బడవచ్చు
యముని బాధలేక యమరవలెను
పరుల బాధలేక బ్రతుకుఁడీ నరులార
విశ్వదాభిరామ వినర వేమ!