1. నింగిన మెరిసే నెలవంక
నేలకు దిగివచ్చి నవ్వింది
నా
ప్రేయసిలా ……
2. నాలో నిన్ను చూసుకున్నప్పుడు నాపై
నీకు వున్నది స్నేహం
నాలో నన్ను చూసినప్పుడు నాపై నీకు
వున్నది ప్రేమ
3. చల్లని
చిరునవ్వు సాక్షిగా!
వెచ్చని
సూర్యకిరణాల సాక్షిగా!
వెన్నల సాక్షిగా!
నీవు లేకుంటే నేను లేను …
నా జీవితానికి అర్ధం లేదు ….
4. బాధే బందువయ్యేను,
బ్రతుకే భారమయ్యేను,
నీ తోడు లేని నా నీడకు ….
5. ప్రేమంటే పలికే పదాలు కాదు …
ప్రేమంటే పెదాలు సైతం పలకలేని భావాలు ….
6. నీ మనసులో ఎవరు వున్నారో … తెలియదు ….
కానీ నా మనసులో నువ్వే వున్నావు …
ఎప్పటికీ నువ్వే ఉంటావు
7. కానీ నీ జీవితం లో
ఎప్పుడూ ఊహించని
మూడో వ్యక్తి రావడం ….
8. అప్పు అయినా, ప్రేమ అయినా
తిరిగి ఇస్తేనే దాని విలువ …..
లేకపోతే రెండూ భారమే …….
9. నేను అనే పదం లో …..
నీ అంటే నేను ….
ను అంటే నువ్వు ……
ఆ పదం లో ఏ అక్షరం లేకున్నా అర్ధమే లేదు ……..
10. కల్మషం లేని నా హృదయానికి
నువ్వు చేసిన గాయం …..
నీ కార్చే కన్నీటితో మానిపోదు చెలి ……..